ఏపీలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వైజాగ్, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.