AP: మరో 24 గంటల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు

AP: పశ్చిమ మధ్య- నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే బలహీనపడనుంది. మరో 24 గంటల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలోనూ కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పోర్టులు అన్నింటిలోనూ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

సంబంధిత పోస్ట్