తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఏర్పడిన ద్రోణుల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లటి వాతావరణం నెలకొంది. రాబోయే గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఏపీలో ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు, అలాగే అంతర్గత కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణులు కొనసాగుతున్నాయి.