AP: సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేస్తూ, సిలికాన్ ఫ్యాబ్లకు 80 శాతం పెట్టుబడి రాయితీ కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వ రాయితీకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుందని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం జీవో నం.87ను జారీ చేసింది. తిరుపతిలో 5,000 ఎకరాల్లో భారీ సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.