ఏపీ స్పెషల్ టెట్–2026 పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం అక్టోబర్ 11 నుంచి 15 వరకు కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 68,420 మంది ఉపాధ్యాయులు 83,015 పేపర్లకు దరఖాస్తు చేసుకోగా, 79,743 పేపర్లలో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో 96.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in/ లో లాగిన్ అయి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.