ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన ఏపీ విద్యార్థులు

AP: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న 21 మంది విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించారు.  ఈ నెల 15న సాహసయాత్ర ప్రారంభించి.. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు శనివారం చేరుకున్నారు. ఏపీ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరిగిన ఈ సాహసయాత్రకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది, పది, ఇంటర్ చదువుతున్న 21 మంది దివ్యాంగ విద్యార్థుల్ని ఎంపిక చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్