ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా.కేవీ శ్రీనివాసులు రెడ్డి విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను స్కూల్ లాగిన్‌లలో పొందవచ్చు. మనమిత్ర వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.