AP: కూటమి ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపుతున్న ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులకు దిగుతున్నారని వైసీపీ మండిపడింది. దాడులు, దౌర్జన్యాలు, తగలబెట్టడాలతో ఏపీ రాష్ట్రాన్ని మరో బిహార్‌లా చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ మార్చేశారని పేర్కొంది. వైసీపీ కీలక నేతలు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేశ్, భూమనపై దాడులు జరిగినా.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఫైరయ్యింది. కూటమి పాలనలో ఏపీ నయా బిహార్‌గా అవతారమెత్తిందని వెల్లడించింది.