కువైట్‌లో ఏపీ మహిళకు నరకయాతన.. కాపాడాలంటూ!

AP: బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన ఏపీ మహిళ అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. తనను కాపాడాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆమె వేడుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన భాగ్యవతి ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. యజమాని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తనను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌కు వచ్చేస్తానంటే ఏజెంట్‌కు ఇచ్చిన డబ్బు కట్టాలంటూ యజమాని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్