AP: అమరావతిలో APCPDCL నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక కార్యాలయం, విద్యుత్ సేవల నిర్వహణలో మరింత సమర్థతను తీసుకురానుంది. సీఎం ఆశయ సాధన దిశగా విద్యుత్ శాఖ ఉద్యోగులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని, కష్టకాలాల్లో కూడా వెనుకడుగు వేయకుండా విధులు నిర్వర్తించే విద్యుత్ సిబ్బంది సేవలు అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమని, పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెరుగుతోందని తెలిపారు.