ఆర్టీసీ జోనల్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి అప్పలనాయుడు రాజీనామా

AP: జనసేన పార్టీ నేత రెడ్డి అప్పలనాయుడు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 2024 నవంబరు 14న జోనల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, స్థానిక ఎన్నికల్లో ఏలూరు మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున బరిలో నిలవాలని నిర్ణయించుకోవడంతో ఈ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన సమర్పించిన రాజీనామాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన తన పదవిని వదులుకున్నట్లు స్పష్టమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕