PM ఆవాస్ యోజన-NTR పథకానికి దరఖాస్తు గడువు పెంపు

AP ప్రభుత్వం PM ఆవాస్ యోజన గ్రామీణ–NTR పథకం దరఖాస్తు గడువును నవంబర్ 30 నుంచి డిసెంబర్ 14 వరకు పొడిగించింది. అర్హత కలిగిన వారు దరఖాస్తుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి రూ.2.50 లక్షల వరకు సాయం, సొంత స్థలం లేనివారికి 3 సెంట్ల స్థలం సహా ఆర్థిక ప్రోత్సాహం అందించబడుతుంది.

సంబంధిత పోస్ట్