AP: ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆరా తీశారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.