ఏపీలో ఇవాళ ఆక్వా రైతుల బంద్‌

AP: రాష్ట్రంలో ఆక్వా రైతులు మేత ధరలు తగ్గించాలని కోరుతూ స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు ఆక్వా మేత డీలర్లు కూడా మద్దతు తెలిపారు. ఆక్వా ఫీడ్ షాపులు, ఆక్వా మెడికల్ షాపులు మూసివేసి నిరసన తెలిపారు. రైతుల వద్ద బకాయిలు పెరిగిపోతున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనతో ఆక్వా రంగంలో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్