AP: గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ.. తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత జగన్ తరచూ కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. అయితే అవి ఎంతవరకు విజయవంతమవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల చేపట్టిన డిజిటల్ బుక్, కోటి సంతకాల కార్యక్రమాలు ఆశించిన స్పందన రాబట్టలేకపోయాయి. డిజిటల్ బుక్‌లో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపైనే ఫిర్యాదులు రావడం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం పెద్దగా ఊపందుకోకపోవడం వంటి పరిణామాలు పార్టీకి నిరాశను మిగిల్చాయి.