AP: ఒంగోలులో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎంపీ మాగుంట మధ్య వాగ్వాదంతో రసాభాసగా మారింది. వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పనులు ఎలా పూర్తి చేస్తారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రశ్నించగా, జెడ్పీ సమావేశంలో రాజకీయాలు చేయొద్దని ఎంపీ మాగుంట సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపీ మాగుంట సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.