ఏపీ రాజధానిపై టీడీపీ, వైఎస్సార్సీపీ వాదనలు అర్థరహితమని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా రాజధానిపై చర్చ జరగడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించిన ఆయన, రాజధానిపై రాజకీయ ఫుట్బాల్ను ఆపేయాలని అన్ని పార్టీలకు సూచించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.