25 ఏళ్ల తర్వాత నిశబ్దంగా మారిన జంతు పునరావాస కేంద్రం

AP: విశాఖపట్నంలోని ఆరిలోవ జంతు పునరావాస కేంద్రం (ఏఆర్‌సీ) 25 ఏళ్ల తర్వాత పూర్తిగా ఖాళీ అయ్యింది. ఒకప్పుడు 34 పులులు, 34 సింహాలతో కళకళలాడిన ఈ కేంద్రంలో చివరిగా మిగిలిన 'బిగో' అనే ఆడ సింహం ఈ నెల 7న మృతి చెందడంతో, కేంద్రం నిశ్శబ్దంలో మునిగిపోయింది. 2000లో సర్కస్‌లలో జంతువులపై హింసను నిషేధిస్తూ, వాటి సంరక్షణ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ జంతువులు సహజ జీవితకాలం కంటే ఎక్కువ కాలం (20-25 ఏళ్లు) జీవించాయి. ఇప్పుడు ఈ స్థలాన్ని జూ పార్కు అవసరాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించనున్నట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్