AP: రాష్ట్రాన్ని అర్నబ్ తుఫాన్ భయపెడుతోంది. అంతకంతకూ బలపడుతూ తీరం వైపు అర్నబ్ తుఫాన్ దూసుకొస్తోంది. ఏపీ తీరంపై అర్నబ్ తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉంది. అంచనాలకు మించి అర్నబ్ పంజా విసరబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హుద్ హుద్ తర్వాత అంతటి స్థాయిలో ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా నరసాపురం-అమలాపురం, యానాం-కాకినాడ మధ్య తీవ్ర ప్రభావం ఉండొచ్చని హెచ్చరించారు. రాబోయే 6 గంటల్లో విశాఖ, గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తీరం వెంబడి గంటకు 200-220 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది.