లేగదూడకు కృత్రిమ కాలు.. మంత్రి లోకేశ్ ప్రశంసలు (వీడియో)

AP: పాలకొల్లులోని శ్రీరామ్ నగర్‌లో వేదాంతం సదాశివ మూర్తి అనే వ్యక్తి కృత్రిమ అవయవ కేంద్రాన్ని నిర్వహిస్తుంటారు. అతి తక్కువ రేటుకు కృత్రిమ అవయవాలను పేదలకు అమరుస్తుంటారు. తాజాగా ఆయన ఓ లేగదూడకు ఉచితంగా కృత్రిమ కాలును అమర్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్.. సదాశివ మూర్తిని ప్రశంసించారు. మూర్తి దయా హృదయం చాలా గొప్పదని, త్వరలోనే ఆయనను కలుస్తానని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్