AP: మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం ఉమ్మడి కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, కడప, బాపట్ల, ఏలూరు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్లు దృష్టి సారించి, సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం అధికారికంగా ఉన్న యూరియా లెక్కలకు, గ్రౌండ్ లెవల్లో ఉన్న నిల్వలకు ఉన్న తేడాను పర్యవేక్షించి వివరాలను వెంటనే అందజేయాలని తెలిపారు.