AP: గ్రూప్-1 ఉద్యోగంతో పాటు విశాఖలో తనకు 500 గజాల ఇంటి స్థలం కేటాయించడంపై అథ్లెట్ జ్యోతి యర్రాజీ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2025లో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అథ్లెట్ జ్యోతి స్వర్ణ పతకం సాధించారు. దాంతో మంత్రి లోకేశ్ ఆమెకు అభినందనలు తెలిపి ఆర్థిక సాయం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించింది.