స్థానిక ఎన్నికల్లో దారుణాలు జరిగాయి: జగన్‌ (వీడియో)

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ల దశలోనే ఎన్నడూ చూడని దారుణాలు జరిగాయని ఆరోపించారు. పోలీసుల అండతో అభ్యర్థులపై దాడులు చేశారని, రిటర్నింగ్‌ అధికారులు చంద్రబాబు ఏజెంట్లుగా పనిచేశారని విమర్శించారు. నామినేషన్‌ పత్రాలను చింపేయడం, ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను ఉపసంహరింపజేయడం వంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. బి-ఫారాలను మాయం చేసి ఏకగ్రీవాలంటూ ప్రచారం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕