చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మహదేవ సముద్రం టోల్ గేట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు డ్రైవర్ల మధ్య తలెత్తిన వివాదం ఓ ప్రాణం తీసింది. నిన్న రాత్రి బెంగళూరు నుంచి విజయవాడకు రెండు ప్రైవేట్ బస్సులు బయల్దేరాయి. అయితే డ్రైవర్ల మధ్య వివాదం తలెత్తింది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సుధాకర రాజును శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు ఢీకొట్టాడు. కిలో మీటర్ వరకు మృతదేహాన్ని ఈడ్చుకెళ్లడంతో అతని శరీరం ఛిద్రమైంది.