ప్రేమ వ్యవహారంలో యువ‌కుడిపై దాడి.. 11 మంది అరెస్ట్

AP: క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ వ్యవహారంలో యువ‌కుడిపై దాడి కేసులో11 మందిని ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కర్రలు, బీరుసీసాలు, రాళ్లు, బైకులు స్వాధీనం చేసుకున్నామని, నిందితుల్లో 9 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు రౌడీల్లా ప్రవర్తించడం సరికాదన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్