ఏపీలో మళ్లీ రాజకీయ కాక రాజుకుంది. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పెద్దదండ్లూరులో టీడీపీ నేతలపై మారణాయుధాలతో వైసీపీ నేత హనుమంతరెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరు వర్గాల నాయకులకు తీవ్ర గాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రులను తరలించారు.