దర్శిలో ఎస్‌ఐపై దాడి

AP: ప్రకాశం జిల్లాలోని దర్శిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. YCP నాయకులు పోలీసులపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో దర్శి ఎస్ఐ ఏడుకొండలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులపై జరిగిన ఈ దాడి ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕