మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు.. నెక్స్ట్ టార్గెట్ పేర్ని నానినేనా?

AP: వైసీపీ మాజీ మంత్రుల ఇళ్లపై దాడులతో రాష్ట్రం అట్టుడుకుతోంది. నిన్న అంబటి రాంబాబు, ఇవాళ జోగి రమేశ్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. అయితే నెక్స్ట్ టార్గెట్ ఎవరనే విషయంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మచిలీపట్నం పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిపై దాడి జరిగే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. దాంతో పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పేర్ని నాని ఇంటికి కూడా భద్రత కల్పించారు.

సంబంధిత పోస్ట్