వైసీపీ నేత, మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. 2022 అక్టోబర్ 7న టీడీపీ నేత దారపనేని శ్రీనివాసరావుపై పార్టీ మారాలంటూ కిశోర్ తీవ్రంగా దాడి చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటంతో కిశోర్‌పై కేసు నమోదు చేయలేదు. తాజాగా అతడిపై చర్యలు తీసుకోవాలని దారపనేని శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు కిశోర్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.