AP: తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం కూనవరంలో 8 నెలల గర్భవతి అయిన దుర్గ భవాని మృతదేహానికి శనివారం రీపోస్టుమార్టం నిర్వహించారు. రెండు నెలల క్రితం మృతి చెందిన ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల భర్త భార్యతో గొడవ పడినట్లు ఆడియో కాల్స్ బయటపడటంతో, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీతానగరం ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.