ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వర్సిటీయే తన రాజకీయ ప్రస్థానానికి పునాది అని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా పరిశోధనలకు నిలయాలుగా మారాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో సరికొత్త నైపుణ్యాలను పెంపొందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని ఆయన ఆకాంక్షించారు.