AP: ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలం కట్టుబడిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు లేని ఓ చిన్నారిపై మేనమామ, అత్త అమానుషంగా ప్రవర్తించారు. బీహార్ నుంచి వలస వచ్చిన దంపతులు చనిపోవడంతో, వారి మైనర్ కుమార్తెను మేనత్త, మేనమామ తమతో పాటు కట్టుబడిపాలెంకు తీసుకువచ్చారు. చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలు గమనించిన స్థానికులు, బాలల సంరక్షణ కమిటీ (CWC) అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.