రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు ఎత్తివేసింది: మంత్రి లోకేశ్

AP: ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పరిమితులను ఎత్తివేసి ఎగుమతులకు అనుమతించిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. దీని కోసం కృషి చేసిన భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకే రంగంపై ఎక్కువగా ఆధారపడకుండా వచ్చే ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త మార్కెట్లను విస్తరించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్