విజయవాడలో ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ తన నిజాయితీని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు మారుతి నగర్ నుంచి బస్టాండ్‌కు వెళ్లే క్రమంలో, 12 తులాల బంగారు నగలున్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ ఆ బ్యాగును గమనించి వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఆయన నిజాయితీని అభినందిస్తూ అర్బన్ డీఎస్పీ శ్రీనివాసులు చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు.