నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. రూ.30 లక్షల నగదు అప్పగింత

AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు తన నిజాయితీని చాటుకున్నారు. విజయవాడకు చెందిన ఎం.వి.సుబ్బారావు కుటుంబం ఒంగోలులో ఆటోలో ప్రయాణిస్తూ, రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగును అందులోనే మరిచిపోయింది. విషయం గుర్తించిన సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతలోనే ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు ఆ బ్యాగును గుర్తించి, ప్రయాణికుల కోసం వెతికి, ఆచూకీ దొరకకపోవడంతో నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి సీఐ నాగరాజు సమక్షంలో అప్పగించారు. అనంతరం సీఐ సమక్షంలో సుబ్బారావుకు బ్యాగును అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్