AP: అనంతపురం జిల్లా కర్నూల్‌లో విషాదం నెలకొంది. స్థానిక విద్యామందిర్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలిక ఆటో కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్కూల్ ముగిసిన అనంతరం ఆటో ఎక్కి డ్రైవర్ పక్క సీట్‌లో కూర్చుంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారి పడగా.. ఆటో బాలిక తలపై వెళ్లింది. దీంతో తల నుజ్జు నుజ్జు అయి మృతి చెందింది. అయితే ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.