AP: ఆయేషా మీరా హత్యాచారం కేసులో ఆధారాలు లభించలేదన్న కారణంతో సీబీఐ కోర్టు ఇటీవల కేసును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ సీబీఐ కోర్టు ఆమె అవశేషాలను కుటుంబసభ్యులకు అప్పగించింది. తన కుమార్తె అవశేషాలను తండ్రి కన్నీళ్లతో మోసుకెళ్లారు. అది చూసి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శుక్రవారం విజయవాడలోని శ్మశాన వాటికలో ఆయేషా మీరా అవశేషాలను ఖననం చేయనున్నారు.