AP: తూర్పు గోదావరి జిల్లా, చాగల్లు మండలం ఊనగట్ల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న గూడపాటి యశ్వితసాయిశ్రీ పోటీ చేస్తున్నారు. ఊనగట్ల పంచాయతీ మహిళలకు రిజర్వ్ కావడంతో, టీడీపీ నేత గూడపాటి శ్రీనివాస్ కుమార్తె అయిన యశ్విత, కూటమి మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 16న తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు యశ్విత స్వయంగా వెల్లడించారు.