పులివెందులకు బాబు, పవన్.. జగన్ కోటలో కూటమి సభ

AP: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అక్టోబర్‌ 5న తొలిసారి కలిసి వెళ్లనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా లింగాల మండలం పార్నపల్లె సమీపంలో రూ.480 కోట్లతో నిర్మించిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌ అమరజీవి జలధార’ తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అలాగే అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీరి పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕