AP: చంద్రబాబు అధికారంలోకి వస్తే కరవులే కాదు.. జనాలకు తిప్పలు కూడా వస్తాయని వైసీపీ ఆరోపించింది. సోమవారం ఎక్స్ వేదికగా.. ‘యూరియా కోసం రైతుల్ని లైన్‌లో నిలబెట్టారు. రేషన్ కోసం పేదల్ని వరుసలో నిలబెట్టారు. గ్యాస్ కోసం గృహిణులను క్యూలో నిలబెట్టారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారుల్ని లైన్‌లో నిలబెట్టారు. నెక్స్ట్ ఎవరు బాబూ?’ అని వైసీపీ ట్వీట్ చేసింది.