AP: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాన రహదారి గుండా భారీ రోడ్ షో నిర్వహించారు. టీడీపీ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పీఎస్. మంజునాథ్‌తో కలిసి చైతన్య రథంపై జోరుగా ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.