పార్లమెంట్ ఆవరణలో సైకిల్‌పై సవారీ చేసిన బాలయ్య (వీడియో)

పార్లమెంటు ఆవరణలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, పార్టీ ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు బాలకృష్ణకు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను రోజూ పార్లమెంటుకు వచ్చేందుకు ఉపయోగించే సైకిల్‌ను చూపించారు. బాలయ్య సైకిల్ తొక్కి, సరదాగా కాసేపు నడిపారు.

సంబంధిత పోస్ట్