జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రకాశం జిల్లా, ఒంగోలు రాజకీయాల్లో తన పట్టు నిలుపుకోవడం, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల్లో మళ్లీ కలుద్దామని పవన్ చెప్పడంతో, బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత, పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైసీపీని వీడిన బాలినేని తదుపరి అడుగుపై సస్పెన్స్ కొనసాగుతోంది.