అమ్మకానికి బందరు పోర్టు: మాజీ మంత్రి పేర్ని నాని

AP: కూటమి ప్రభుత్వం బందరు పోర్టును అమ్మకానికి పెట్టిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అందుకే పోర్టు పనులు నిలిపివేశారని, త్వరలోనే మరో 3వేల ఎకరాలను బలవంతంగా సేకరించడానికి భూసేకరణ ప్రక్రియను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఇప్పటికే చంద్రబాబుకు దీనిపై ప్రజంటేషన్ ఇచ్చారని, వాడపాలెం గ్రామంలో 6, 7 వేల ఎకరాల భూమిని గోవా షిప్ యార్డుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్ని నాని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕