AP: డిసెంబరు నాటికి బందరు పోర్టు పనులు పూర్తి అవుతాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఫిషింగ్ హార్బర్ల పనుల్లో మాజీ సీఎం జగన్ అండ్ కో కమీషన్లు దండుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీ విషయంలో వైసీపీ రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలోని పోర్టులు పూర్తి చేసి, ప్రారంభించేది తామేనని ఆయన పేర్కొన్నారు.