టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన భక్తిని చాటుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం తిరుమల వెంకటేశ్వరస్వామికి చేసిన మొక్కును తీర్చుకునేందుకు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. జనవరి 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి కాలినడకన తిరుమల వరకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన త్వరగా విడుదలై మళ్లీ సీఎం కావాలని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరడంతో ఇప్పుడు మొక్కును తీర్చుకునే క్రమంలో ఈ యాత్ర చేపడుతున్నారు.