ప్రకాష్‌రాజ్‌పై బండ్ల గణేష్ ఫైర్

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అలియాస్ జోసెఫ్ బచలకురి అరెస్టుల నేపథ్యంలో సినీ పరిశ్రమలో నటుడు ప్రకాష్‌రాజ్, నిర్మాత బండ్ల గణేష్ మధ్య ట్వీట్ వార్ తీవ్రస్థాయికి చేరింది. 'ప్రశ్న రావణ్'కు రిమాండ్ విధించడంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెడతారని, ఇది గొంతులను నొక్కే కుట్ర అని ఆరోపించారు. దీనిపై స్పందించిన బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవనశైలిని ఎండగడుతూ, 'తాగి వాంతి చేసుకుంటావు, నీ జీవితంలో మంచి పని లేదు. అనవసరంగా ఇతరుల గురించి వాగుతూ నీ విలువను నువ్వే తగ్గించుకోకు' అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది.

సంబంధిత పోస్ట్