ఈతకు వెళ్లి యువకుడు మృతి

ఈతకు వెళ్ళి బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. చెరకుపల్లె మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన వంగర జగదీశ్ కుమార్(26) కడపలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఐదుగురు స్నేహితులతో కలిసి లింగంపల్లె శివారులోని పంప్ హౌస్ వద్ద ఈతకు వచ్చాడు. నదిలో దిగగా ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్