అద్దంకి: వార్నింగ్ ఇచ్చిన సీఐ మల్లికార్జునరావు

సంక్రాంతి పండుగ సందర్భంగా అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలోని గ్రామాలలో పేకాట, కోడి పందాలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ మల్లికార్జునరావు శనివారం హెచ్చరించారు. గ్రామాలలో వీటిపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. సెలవులకు ఊర్లు వెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇంట్లో ఉన్న బంగారం, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్