అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో రెండు బైకులను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.